భారతదేశపు చిట్టచివరి మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్. షాజహాన్ పుత్రులలో మూడవవాడు, ఢిల్లీలో జన్మించాడు. ఇతనికి మతాభిమానం ఎక్కువ. దురహంకారి. సింహాసనం కోసం సొంత సోదరులను హతమార్చిన క్రూరుడు
ఇతని పెద్ద అన్న దారాషుకో ఆధ్యాత్మికపరుడు, పరమత సహనం కలవాడు. రాజ్యం కోసం అన్న దారా, తమ్ముడు మురాద్, ఇంకో అన్నతో చేతులు కలిపి తండ్రిమీదనే దండయాత్ర చేసి తండ్రిని కారాగృహంలో బంధిస్తాడు.
దారాను, మురాద్ ను చంపిస్తాడు. ఇంకో అన్నను రాజ్యం నుండి తరిమివేసి 1658 సం.లో సింహాసం అధిష్టిస్తాడు.
ఇతను సమర్ధుడైన పాలకుడే. కానీ హిందూమతం పట్ల విపరీత ద్వేషం కలవాడు. హిందువులను రకరకాలుగా హింసించేవాడు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనగరంలోని విశ్వనాధ దేవాలయాన్ని పడగొట్టించి ఆ రాళ్లతోనే మసీదును కట్టిస్తాడు. రాజ్యమంతటా ఉన్న హిందూ దేవాలయాలను పడగొట్టించాడు.
హిందువులు జట్టు పెంచకూడదని శాసనం చేసి జట్టుపెంచిన వారిమీద జిజియాపన్ను విధించి వసూలు చేసేవారు.
హిందువులు వాహనాలమీద తిరగరాదు. గుర్రపు స్వారీ చేయకూడదనే ఆంక్షలు విధించాడు. హిందువుల పాఠశాలలు, విద్యాలయాలను మూయించాడు. దీనితో అప్పటిదాకా మొగలాయిలతో సఖ్యతగా ఉన్న హిందువులు వారికి విరోధులుగా మారారు.
మేవాడ్ రాజు రాజా జస్వంత్ సింగ్ భార్యను, బిడ్డలను బంధించి వారిని బలాత్కారంగా మహ్మదీయులుగా మార్చటానికి ప్రయత్నించాడు. దీనితో రాజపుత్రులు రాణా రాజ్ సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసి కొండప్రాంతాలను విడిపించుకున్నారు.
జౌరంగజేబ్ తన రాజ్యాన్ని ఆంధ్రప్రాంతంలోని గొల్కొండ, బీజాపూర్ వరకు విస్తరించుకున్నాడు. ఇతను ఎవరినీ నమ్మేవాడు కాడు.
మహారాష్ట్ర రాజైన ఛత్రపతి శివాజీని సంప్రదింపులకు ఢిల్లీకి రప్పించి మాయోపాయంతో కారాగృహంలో బంధించాడు. కానీ శివాజీ తన తెలివితేటలతో కారాగృహం నుండి తప్పించుకున్నాడు. ఆ తరువాత ఔరంగజేబ్ కు పక్కలో బల్లెంలాగ మారాడు.
జౌరంగజేబ్ మరణంతో మొగలాయి సామ్రాజ్యం పతనమై, ఛిన్నాభిన్నమై అంతరించి పోయింది.